‘దిమాక్ ఖరాబ్.. ‘ ఫుల్ వీడియో సాంగ్ !


పూరి-రామ్ కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్టయింది. మాస్ ని మురిపించింది. పూరి, రామ్ లకి హిట్ కరువుని తీర్చింది. మంచి లాభాలని తీసుకొచ్చింది. ఈ సినిమాలోని ‘దిమాఖ్ ఖరాబ్.. ‘ అదిరిపోయింది. ఇందులో హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభా నటాషా పోటీపడి మరీ.. గ్లామర్ ఒలకబోశారు. ఇప్పుడీ సాంగ్ ఫుల్ వీడియో సాంగ్ బయటికొచ్చింది. 

పక్కా మాస్ మసాలా, డీజే స్టైల్‌లో మణిశర్మ కంపోజ్ చేసిన బీట్‌కి తగ్గట్టు, రామ్ ఫుల్ ఎనర్జిటిక్‌గా, చాలా ఈజ్‌తో వేసిన స్టెప్స్‌కి థియేటర్స్‌లో విజిల్స్ పడ్డాయి. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్‌ కొరియోగ్రఫీ చేశాడు. జులై 18న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టేసింది. ఈ హిట్ కిక్కులో ఉన్న పూరి తన తదుపరి సినిమాని విజయ్ దేవరకొండతో చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక రామ్ తదుపరి సినిమా ఇంకా ఖరారు కాలేదు.