మాజీ ఎంపీ శివప్రసాద్ ఇక కష్టమే !


తెదేపా సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ శివ ప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించినట్టు సమాచారమ్. ఆయన గతకొన్నాళ్లుగా కిడ్ని సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. రెండ్రోజుల క్రితం చైన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నారు. ఐతే, ఆయన ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడతం లేదు. రోజు రోజుకి మరింత క్షీణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శివప్రసాద్ తిరిగి మాములు మనిషి అవ్వడం కష్టమే అంటున్నారు. పలువురు తెదేపా నేతలు చెన్నై వెళ్లి శివ ప్రసాద్ ని పరామర్శిస్తున్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు ఇవాళ చెన్నై వెళ్లనున్నారు. శివ ప్రసాద్ ని పరామర్శించనున్నారు. సమైక్యాంధ్ర కోసం, ఆ తర్వాత ఆంధ్రపదేష్ హక్కుల కోసం పార్లమెంట్ వేదిక శివ ప్రసాద్ చేసిన ఆందోళనలు జాతీయ మీడియాని సైతం ఆకట్టుకొన్నాయ్. ఆయన రోజుకో వేషంలో వచ్చిన తన నిరసనని తెలిపేవారు. శివ ప్రసాద్ కళా పోషనని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించిన సందర్భాలు ఉన్నాయి. తన వచ్చిన కళతో నిరసన తెలపడంలో తప్పేముందని శివ ప్రసాద్ అనేవారు.