ధోని మ్యాటర్.. తేల్చేశాడు !


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవితవ్యంపై కొన్నాళ్లుగా జోరుగా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్ కు ముందు ఆ తర్వాత కూడా ధోని రిటైర్డ్మెంట్ పై వార్తలు వినిపిస్తున్నాయి. ధోని మాత్రం ఎప్పటిలాగే కూల్ గా ఉంటున్నాడు. మరోవైపు, బీసీసీఐ మాత్రం ధోని దాదాపు పక్కనపెట్టినట్టే కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కి ధోనిని ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో వచ్చే యేడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం ధోనిని పరిగణలోనికి తీసుకోవట్లేదనే అర్థమవుతోంది.

మరోవైపు మాజీ ఆటగాళ్లు, మాజీ సెలక్టర్లు మాత్రం బీసీసీఐ ధోనితో మాట్లాడాలి. ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలి. ధోని ఆడాలనుకొంటే ఆయన్ని జట్టులోకి తీసుకోవాలి. లేదంటే ధోని ఘనంగా వీడ్కోలు పలకాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోలెజెండరీ బ్యాట్స్ మన్, మాజీ సారథి సునీల్ గవాస్కర్ ధోని మ్యాటర్ ని తేల్చేశారు. ధోనీ రిటైరయ్యే సమయం ఆసన్నమైంది.అతడి మీదున్న గౌరవంతో చెబుతున్నా.. ధోనీ టైమ్ అయిపోయింది. టీమిండియా భవిష్యత్ పై దృష్టిసారించాలి. అయితే ధోనీని జట్టు సాగనంపకముందే.. అతడే వెళ్లిపోతాడని భావిస్తున్నానని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.