కోడెల చివరి ఫోన్ కాల్.. ఎవరికి చేశారో తెలుసా?


తెదేపా అధినేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య కేసులో ఆయన ఫోన్ కాల్ డాన్ కీలకంగా మారనుంది. ఆయన ఫోన్ కనిపించకుండా పోవడంతో కాల్ డేటాని విశ్లేషిస్తున్నారు పోలీసులు. ఆత్మహత్య చేసుకొన్న రోజున కోడెల ఉదయం 9 నుంచి 10గంటల మధ్యలో దాదాపు 10-12 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారమ్. చివరి ఫోన్ కాల్ 9సెకన్లు గన్ మెన్ ఆదాబ్ తో మాట్లాడారు. గత ఐదేళ్లుగా ఆదాబ్ కోడెల దగ్గర పనిచేస్తున్నారు. ఆదాబ్ ది గుంటూరు ప్రాంతమే.

మరోవైపు కోడెల ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు గురువారం గవర్నర్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇన్నాళ్లు సీబీఐపై నమ్మకం లేదు. సీబీఐ అని రాష్ట్రంలోకి రానివ్వబోమన్న చంద్రబాబు.. ఇపుడు సీబీఐ విచారణ ఎలా కోరుతున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కోడెల కేసుని సీబీఐకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఐతే, దీనిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. మొత్తానికి.. కోడెల ఆత్మహత్య ఏపీలో పొలిటికల్స్ ని హీటెక్కించేస్తోంది.