ట్విట్టర్’కు థ్యాంక్స్ చెప్పిన పవన్


జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్విట్టర్ యాజమాన్యానికి కృతజ్ఝతలు తెలిపారు. ఇటీవల పవన్ పిలుపు మేరకు జనసైనికులు నల్లమల అడవిలోని యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. #SaveNallamala యాష్ ట్యాగ్ ని వైరల్ చేశారు. దాంతో పాటు #YSJaganFailedCM యాష్ ట్యాగ్ ని జనసైనికులు వైరల్ చేశారు. ఐతే, ఇలా చేయడం ట్విట్టర్ నిబంధనలకి విరుద్ధం. అందుకే 400మంది జనసైనికులు ట్విట్టర్ అకౌంట్స్ ని బ్లాక్ చేశారు.  

తాజాగా ఈ అకౌంట్స్ ని ట్విట్టర్ యాజమాన్యం పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో పవన్ ట్విట్టర్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఝతలు
తెలిపారు. రాజ్యాంగబద్ధమైన వ్యక్తీకర స్వేచ్చని సమర్ధించి త్వరగా రెస్పాన్స్ అయినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పవన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ఇక, సీఎం జగన్ వందరోజుల పాలనపై పవన్ పెదవి విరిచిన సంగతి తెలిసింది.