హరీష్ కు ఓదార్పు !

టాలీవుడ్ దర్శకులు హరీష్ శంకర్ ని ఓదారుస్తున్నారు. బాధలో ఉన్న ఆయనకి ధైర్యం చెబుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమా టైటిల్ విషయంలో మొదటి నుంచి విమర్శలొస్తున్నాయ్. టైటిల్ ని మార్చాలని బోయ, వాల్మీకి సామాజికవర్గాలు డిమాండ్ చేశాయి. ఐతే, ఆ డిమాండ్ ని వాల్మీకి చిత్రబృందం పెద్దగా పట్టించుకోలేదు. సినిమాలో వాల్మీకిని తప్పుగా ఏమీ చూపించలేదన్నారు. సెన్సార్ బోర్డ్ కూడా టైటిల్ విషయంలో అభ్యంతరం చెప్పకపోవడం ధైర్యంగా ఉన్నారు.

కానీ వాల్మీకి టైటిల్ ని మార్చక తప్పలేదు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లా కలెక్టలు ఆయా జిల్లాల్లో వాల్మీకి చిత్రం విడుదల కాకుండా ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాల్మీకి చిత్రబృందం తగ్గక తప్పలేదు. టైటిల్ ని గద్దలకొండ గణేష్ గా మార్చారు. ప్రెస్ మీట్ లో వాల్మీకి టైటిల్ మార్పు గురించి వివరణ ఇస్తున్న సమయంలో దర్శకుడు హరీశ్ శంకర్ భాగోద్వేగానికి గురయ్యాడు. టైటిల్ మారుస్తున్నందుకు బాధలేదు. కానీ, అసలు సినిమాలో ఏమి ఉందో చూడకుండా.. టైటిల్ మార్చాలని డిమాండ్ చేయడం బాధ కలిగించింది. నా తొలి సినిమా షాక్ ప్లాప్ అయినప్పుడు కూడా బాధ అనిపించలేదు. కానీ, ఇప్పుడు బాధ కలుగుతుందన్నారు.

బాధల్లో ఉన్న హరీష్ కు టాలీవుడ్ దర్శకుడు అండగా నిలుస్తున్నారు. దర్శకుడు వంశీపైడిపల్లి, బాబీ తదితరులు ట్విట్టర్ వేదిక హరీశ్ కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు వాల్మీకి టాక్ బయటికొచ్చింది. సినిమా అద్భుతంగా ఉందని చెబుతునారు. హరీష్ సినిమా బాగా తీశాడు. వరుణ్ తేజ్ గత్తర లేపింది. గద్దలకొండ గణేష్ గా ఊరమాస్ నటనతో అదరగొట్టాడని చెబుతున్నారు.