‘చాణక్య’ రిలీజ్ డేట్ ఫిక్స్  


యాక్షన్ హీరో గోపీచంద్ తాజా చిత్రం ‘చాణక్య’. మెహ్రీన్  కథానాయిక. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘చాణక్య’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. అక్టోబర్ 5న చాణక్య ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు తిరు చాణక్య రిలీజ్ డేటు పోస్టర్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.  ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకి మంచి స్పందన వచ్చింది. ఈసారి యాక్షన్ థ్రిల్లర్ చాణక్యతో గోపీచంద్ హిట్ కొట్టేలా కనబడుతున్నాడు.