కల్యాణ్ రామ్ సంక్రాంతి ఫైట్


సంక్రాంతి సినిమాలు ఏంటన్నవి ఇప్పుడే తేలిపోతున్నాయ్. ఇప్పటికే సంక్రాంతి రేసులో స్టార్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్ నిలిచారు. వీరితో పాటు బాలయ్య సంక్రాంతి రేసులో ఉన్నారు. మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా సంక్రాంతి ఫైట్ చేద్దామనుకొన్నారు. మారుతి దర్శకత్వంలో తేజు నటిస్తున్న ‘ప్రతిరోజు పండగే’ని సంక్రాంతి కానుకగా తీసుకొద్దామనుకొన్నారు. కానీ యుద్ధానికి వెఌతే తనకే నష్టమని డిసెంబర్ లోనే వచ్చేందుకు రెడీ అయ్యాడు తేజు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ప్రతిరోజు పండగే రానుంది.

కల్యాణ్ రామ్ మాత్రం దైర్ఘ్యం చేశాడు. సతీష్ విగ్నేశ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. ఈ దర్శకుడికి సంక్రాంతి సెంటిమెంట్ గా మారింది. 2018 సంక్రాంతి కానుకగా వచ్చిన శతమానం భవతి సూపర్ హిట్ అయింది. ఏకంగా జాతీయ అవార్డుని తెచ్చిపెట్టింది. ఇక 2019 సంక్రాంతి కానుకగా వచ్చిన శ్రీనివాస కల్యాణం ఆకట్టుకోలేదు. అయినా.. 2020సంక్రాంతి సీజన్ ని విగ్నేశ వదులుకోవడం లేదు. ఎంత మంచివాడవురా! సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.