గ్యాంగ్ లీడర్ సేఫ్’యేనా ?


విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ప్రియా అరుళ్ మోహన్ కథానాయిక. కార్తికేయ విలన్ గా నటించారు. లక్ష్మి, శరణ్య, అనీశ్, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ బాణీలు అందించారు. గతవారం (సెప్టెంబరు 13) విడుదలైన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. తొలిరోజే రూ. 4కోట్లకిపైగా వసూలు చేసింది. వీకెండ్ లో గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ రూ. 11కోట్లకి పైగా చేరాయి. తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా గ్యాంగ్ లీడర్  రూ.40 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

దాదాపు రూ. 30కోట్ల బడ్జెట్ తో గ్యాంగ్ లీడర్ తెరకెక్కినట్టు తెలిసింది. తొలివారంలోనే రూ. 40కోట్ల గ్రాస్ ని తీసుకొచ్చింది. నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకే అమ్ముడుపోయాయ్. ఈ నేపథ్యంలో గ్యాంగ్ లీడర్ సేప్ అనే చెప్పాలి. కాకపోతే.. నాని హిట్ సినిమాకి వచ్చిన రేంజ్ లో కలెక్షన్స్ రాలేదు. ఇక ఈ వారం గ్యాంగ్ లీడర్ కి గద్దలకొండ గణేష్ పోటీగా వచ్చేశాడు. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొన్నాడు. మరో రెండు వారాలు ఆగితే మెగాస్టార్ సైరా రాబోతుంది. ఈ నేపథ్యంలో గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ లేదని చెప్పవచ్చు. దీంతో లాభాలు తీసుకురాకున్నా.. గ్యాంగ్ లీడర్ పెట్టిన పెట్టుబడి తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది.