ఇది లిక్కర్’తో నడిచే బండి.. గుద్దిదే అడ్రస్ ఉండదు!


‘ఆర్ఎక్స్100′ హీరో కార్తీకేయ తాజా చిత్రం ’90ఎంఎల్‌’. నేహా సోలంకి హీరోయిన్. కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వం వహించారు. అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ లోనే కార్తీకేయ ఎప్పుడూ 90ఎంఎల్ వేస్తూ కనిపించాడు. దానికి ఓ లాజిక్ కూడా చెప్పారు. ‘నా కడుపున దేవదాస్ లాంటి కొడుకే పుట్టాలని తల్లి కోరుకోవడం’ చూపించారు. 

‘డీజిల్ తో నడిచే బండ్లని చూసింటావ్, పెట్రోల్ తో నడిచే బండ్లని చూసింటావ్. ఇది లిక్కర్ తో నడిచే బండి.. గుద్దిదే అడ్రస్ ఉండదు’ అని కార్తీకేయ చెప్పే డైలాగ్ బాగా పేలింది. డైలీ ఎంతేస్తాం అంటూ లెక్చరర్ అలీ అడిగితే.. పూటకో 90వేస్తా సర్. ఏ క్వాటర్  ఇస్తే వేయవా అంటే.. డాక్టర్ 90ఎంఎల్ యే తాగమన్నారంటూ కార్తీకేయ చెప్పడం ఆకట్టుకొంది. మొత్తంగా 90ఎంఎల్ టీజర్ లో యాక్షన్, డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయ్. టీజర్ తో 90ఎంఎల్ మాంఛి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుందని అర్థమవుతోంది.