ఉత్తమ నటుడు మహేష్ బాబు


హైదరాబాద్ లోఎన్ కన్వెన్షన్ లోని శుక్రవారం  దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ఘనంగా జరిరిగింది. సినీ పరిశ్రమకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ హాజరయ్యారు. ‘భరత్ అనే నేను’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా మహేశ్ బాబుకు అవార్డు దక్కింది. గవర్నర్ తమిళసై చేతుల మీదుగా మహేశ్ బాబు సతీమణి నమ్రత ఈ అవార్డును అందుకున్నారు.

‘భరత్ అను నేను’ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. మహేష్-కైరా అడ్వానీ జంటగా నటించారు. ఇందులో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించారు. సీఎం మహేష్ నటనకి ప్రశంసలు దక్కాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ముఖ్యంగా ఇందులో కథానాయకుడు ట్రాఫిక్ సమస్యలపై తీసుకొన్న కఠిన నిర్ణయాలు ఆకట్టుకొన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు భరత్ అను నేను సినిమాలో నుంచి కాపీ కొట్టినట్టే ఉన్నాయని కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే.