బన్నీ సినిమాలో రస్మిక.. ఇలా కనిపించనుందా ? 


స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల.. వైకుంఠపురంలో’ సినిమాతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్-బన్నీ కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రమిది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండనుంది. వీరిది హ్యాట్రిక్ కాంబోనే. వీరి కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య2 సూపర్ హిట్స్ నిలిచిన సంగతి తెలిసిందే

ఇక బన్నీ-సుక్కు హ్యాట్రిక్ సినిమా కోసం రష్మిక మందనని హీరోయిన్ గా తీసుకొన్నారు. ఇందులో ఆమె పక్కా పల్లెటూరు పిల్లలా కనిపించబోతుందట. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ కథని సుక్కు మహేష్ కోసం రాసుకొన్నారు. కొన్ని కారణాల వలన మహేష్ తో సుక్కు సినిమా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఇదే కథతో బన్నీతో సినిమా తీయబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయింది. నవంబర్ లో సినిమా ప్రారంభోత్సవం ఉంటుందని సమాచారమ్.