చైతూకి రెండో భార్య ఉందా ?


అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యకి రెండో భార్య ఉందట. ఈ విషయాన్ని స్వయంగా సమంతనే బయటపెట్టింది. అలాగని చైతూ సామ్ కి అన్యాయం చేశాడని కాదు. ఇంతకీ చైతూ రెండో భార్య ఎవరో తెలుసా ? తల దిండు. అవునూ.. చైతూ ఎప్పుడూ తలదిండుని పట్టుకొనే పడుకొంటాడట. దాంతో చైతూని ముద్దు పెట్టుకోవడం కష్టం అవుతుందని సామ్ సిగ్గుతో చెప్పేసింది.

మంచు లక్ష్మీ సినీ స్టార్స్ బెడ్ రూం సీక్రెట్స్ ని బయటపెట్టే పనిని మొదలెట్టిన సంగతి తెలిసిందే. ఆమె ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ పేరుతో షో చేస్తోంది. ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్స్ ఈ నెల 23 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ఈ షో వూట్ యాప్‌లో ప్రసారం కానుంది.  ఈ షోలో అక్కినేని కోడలు సమంత కూడా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఒకటి ఇటీవల విడుదలైంది. అందులో సమంత.. తన భర్త నాగచైతన్యకు రెండో భార్య కూడా ఉందనే షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. 

అంతేకాదు.. పెళ్లికి ముందు సామ్, చైతూ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారట. ఈ విషయాన్ని చెబుతూ సామ్ తెగ సిగ్గుపడిపోయింది. ఇక పెళ్లి తర్వాత సామ్, చైతూ మరింత బిజీ అయిపోయారు. సామ్ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటోంది. చైతూ కూడా నటనలో ఎదిగిపోయాడు. ప్రేమమ్, మజిలీ చిత్రాలతో తన నటనతో ఆకట్టుకొన్నాడు. ఇక మంచు లక్ష్మీ సామ్ తో మరిన్ని బెడ్ రూమ్ సీక్రెట్స్ ని చెప్పించబోతుంది. అది ఫుల్ ఏపీసోడ్ లో చూడొచ్చు.