‘సైరా’.. 10 సంవత్సరాల కల !


హైదరాబాద్ లో మెగా సముద్రం ఉప్పొంగుతోంది. ఇప్పటికే అర్థమై ఉంటుంది. అది ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుక హంగామా అని. అవునూ.. ఎల్భీ స్టేడియంలో సైరా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరుగుతోంది. మెగా అభిమానులతో వేదిక కిక్కిరిసిపోయింది. ఒక్కొక్కరుగా అతిథులు ఫంక్షన్ కి విచ్చేస్తున్నారు. వచ్చిన వారు ‘సైరా’ విశేషాలని అభిమానులతో పంచుకొంటున్నారు.

సైరా చిత్రానికి పరుచూరి బ్రదర్స్, బుర్రసాయి మాధవ్ కలిసి మాటలు రాసిన సంగతి తెలిసిందే. వేదికపై పరచూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. “సైరా కథ మా పదేళ్ల కల. కల ఎప్పుడు చెదిరిపోదు. కల కలగానే మిగిలిపోతుంది. కల చెదిరిపోకుండా కల ఎలాగా మిగిలిపోయిందో.. 10 యేళ్ల తర్వాత కూడా చిరంజీవి కూడా యంగ్ గానే కనిపిస్తున్నారు. ఈ కథని చాలామందికి వినిపించారు. వారందరూ చిరంజీవి కోసమే ఈ కథని వదిలేసినట్టు భావిస్తున్నాం. చిరంజీవి కథ విని తానే చేస్తానని చెప్పగానే.. ఆయన కోసం చాలా యేళ్లు వెయిట్ చేశాం. చరణ్ అద్భుతంగా సినిమాని నిర్మించారు. తనకు స్థానాన్ని కల్పించిన తండ్రిని ఎక్కడో కూర్చోబెట్టాలని చరణ్ సినిమాని అద్భుతంగా తీశారు. ఏ గాంధీ అయితే స్వరాజ్యం తెచ్చాడాని పూయిస్తామో.. ఆ గాంధీ అక్టోబర్ 2న సైరా సినిమాని ఆకాశం నుంచి చూస్తారు. ఈ సినిమా విజయోత్సవ సభలో మళ్లీ కలవాలని ఉంది” అన్నారు.