అమెరికా-భారత్ మధ్య చమురు ఒప్పదం

ప్రధాని నరేంద్ర మోడీ వారం రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లారు. ఈరోజు ప్రధాని ‘హౌడీ-మోదీ’ కార్యక్రమంలో పాల్గొనన్నారు. ఇందుకుగానూ ఆయన శనివారమే హ్యూస్టన్ చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఆదివారం ఉదయం 16 చమురు కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంధన రంగానికి సంబంధించి ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. టెల్లూరియన్ (అమెరికా)-పెట్రోనెట్ (భారత్) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.

దీని ప్రకారం ఏడాదికి 5మిలియన్ టన్నుల సహజవాయువు కొనుగోలుకు ఎంవోయూ పచ్చజెండా ఊపింది. దీని గురించిన లావాదేవీలు 2020 మార్చి 31నాటికి తేలనున్నాయి.  మోదీ మరి కాసేపట్లో  హౌడీ-మోదీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొననున్నారు.