టీమిండియాలో అఫ్రిది ఫేవరెట్ ఎవరో తెలుసా ?


పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ట్విటర్ వేదికగా #AskLala పేరుతో అభిమానులతో చిట్ ఛాట్ చేశారు. తన ఫేవరెట్ ఆటగాళ్లు ఎవరని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ కోహ్లీతో పాటు పాక్ ఓపెనర్ బాబర్  అజామ్ , ఆసీస్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లాండ్ టెస్టు సారథి జోరూట్ తన ఫేవరెట్ ఆటగాళ్లని తెలిపాడు. కోహ్లీ, అజామ్ ల మధ్య ఎవరు ఫేవరెట్ అని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు.. ఇద్దరూ సమానమేనని చెప్పాడు. కోహ్లీ టీ20ల్లో.. 71 మ్యాచ్ ల్లో 50.58 సగటుతో కొనసాగుతుండగా పాక్ ఓపెనర్30 మ్యాచ్ ల్లోనే 54.21 సగటుతో రాణిస్తున్నాడు. ఇక, మూడు ఫార్మాట్లలో 50కిపైగా సగటు కలిగిన ఏకైక బ్యాట్స్ మన్ కోహ్లీనే. 

ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఐసీసీ చేసిన ట్వీట్ కు అఫ్రిది స్పందించి కోహ్లీని అభినందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ జోరు చూస్తుంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మీరుమీదున్న వంద సెంచరీల రికార్డుని బ్రేక్ చేసేలా ఉన్నాడు. కెప్టెన్, బ్యాట్స్ మెన్ గా కోహ్లీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక, ఇవాళ టీమిండియా దక్షిణాఫ్రికాతో ఆఖరి టీ20మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిసి సిరీస్ ని క్లీన్ స్వీప్ చేయాలని కోహ్లీసేన భావిస్తోంది. మరోవైపు,ఈ మ్యాచ్’ని గెలిచి సిరీస్ ని సమానంగా పంచుకోవాలని సఫారీలు చూస్తున్నారు.