లైవ్ : ‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్


సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్ది జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన గురువు పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లోని ఎల్భీ స్టేడియంలో కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే వేదిక మెగా అభిమానులతో కిక్కిరిసిపోయింది. లీలలు, కేకలతో హోరెత్తిస్తున్నారు. ఈ వేడుకకి బిగ్ బీ అమితాబ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా హీరోలందరు, సైరా చిత్రబృందం మొత్తం హాజరుకానుంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా ఫంక్షన్ కి విచ్చేస్తున్నారు. ఈ వేడుకని మీరు లైవ్ లో చూసేయండీ.. !