సైరా ప్రీ-రిలీజ్’కు బన్నీ అందుకే రాలేదా ?

మరోసారి అభిమానులకి టార్గెట్ గా మారారు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్. ఆదివారం జరిగిన సైరా ప్రీ-రిలీజ్ వేడుకకి బన్నీ హాజరుకాలేదు. దీనిపై పలు అనుమానాలని వ్యక్తం చేస్తూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బన్నీ ‘అల.. వైకుంఠపురంలో’ సినిమాతో బిజీగా ఉన్నారు. బన్నీ-త్రివిక్రమ్ కాంబో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వలనే బన్నీ సైరా ఫంక్షన్ కి రాలేదని అనుకొన్నా. ఆ విషయాన్ని చెబుతూ బన్నీ ఓ ట్విట్ చేసినా బాగుణ్ను అంటున్నారు. ఇదీగాక సైరా టీజర్, ట్రైలర్ లపై బన్నీ నుంచి స్పందన లేదు. దీంతో బన్నీపై అనమానక తప్పడం లేదు అంటున్నారు.

బన్నీ అభిమానుల వర్షన్ మాత్రం మరోలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి వేదికపైన ఉన్నప్పుడు ఆయనకి సరైన గౌరవం ఇవ్వాలి. అలాకాకుండా చిరు మాట్లాడుతున్నప్పుడు పవర్ స్టార్, పవర్ స్టార్… ! బన్నీ.. బన్నీ.. అంటూ అరవడం ఆయనకి అస్సలు ఇష్టముండదు. గతంలో ఈ విధంగా జరిగినప్పుడే బన్నీ పవన్ అభిమానులపై ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ వివాదం చాన్నాళ్లు నడించింది. ఇప్పుడు ఆ కారణంగా బన్నీ సైరా ప్రీ రిలీజ్ వేడుకకి దూరంగా ఉన్నారని ఆయన అభిమానుల మాట. ఐతే, ఈ రిజన్ తో మెగా అభిమానుల్లో కొందరు సంతృప్తి చెందడం లేదు. ఇప్పటికైనా.. స్వయంగా బన్నీ స్పందించి సైరా ఫంక్షన్ రాకపోవడానికి అసలు కారణం చెబితే బాగుంటుందేమో. లేదంటే.. మెగా అభిమానులు బన్నీని వేరు చేసి చూసేలా కనిపిస్తోంది.