మగ బిడ్డకి జన్మనిచ్చిన అమీ జాక్సన్
పెళ్లికాకుండానే తల్లయింది హీరోయిన్ అమీ జాక్సన్. పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తని అమీ తన ఇన్ స్ట్రోగ్రామ్ ద్వారా తెలిపింది. ఓ చక్కని ఫోటోని పంచుకొంది. తనకి తండ్రిగా ప్రమోషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నట్టుగా అమీ నుదిటి మీద ముద్దుపెడుతున్నాడు ఆమె ప్రియుడు జార్జ్ పనయివోట్. ప్రియుడు ఏంటీ ? మొగుడు కాదా ?? అంటే వీరికి ఇంకా పెళ్లికాలేదు. ఎగ్జేట్ మెంట్ మాత్రమే అయింది. ళ్ళికి ముందే ప్రెగ్నెంట్ కావడంతో హడావుడిగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే అమీ కొన్ని ఫోటోషూట్ లు చేసి వావ్ అనిపించింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమీ తెలుగులో రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమాలో నటించింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ, రోబో 2.ఓ చిత్రాల్లో నటించింది. ఇక 2.ఓ తర్వాత అమీ మరో సినిమా చేయలేదు. అప్పటికే ఆమె గర్భవతి కావడంతో సినిమాలకి దూరంగా ఉంది.