టీ20 సిరీస్ సమం

దక్షిణాఫ్రికాతో మూడు టీ20 సిరీస్ లో మొదటి టీ20 వర్షం వల్ల రద్దయింది. రెండో టీ20లో టీమిండియా ఆర్ రౌండ్ ప్రదర్శనతో ఈజీగా గెలిచేసింది. ఇక స్పిన్  కి అనుకూలించే చిన్నస్వామి వేదికగా జరగనున్న ఆఖరి టీ20 మ్యాచ్  లో టీమిండియా గెలుపు నల్లేరు మీద నడకే అనుకొన్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. సఫారీలు కోహ్లీసేనకు షాక్ ఇచ్చారు. మూడో టీ20 మ్యాచ్ లో సఫారీలు ఈజీగా గెలు పొందారు. తద్వారా సిరీస్ ని సమం చేశారు. మూడు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ అక్టోబరు 2న విశాఖపట్నంలో మొదలు కానుంది.

ఆదివారం బెంగళూరు చిన్న స్వామి వేడిక జరిగిన మూడో టీ20లో మొదటి బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులే చేసింది. 36 పరుగులు చేసిన ధావనే టాప్ స్కోరర్. దక్షిణాఫ్రికా బౌలర్లలో షంసి (1/23), బ్యూరన్,  హెండ్రిక్స్  (2/14), రబాడ (3/39) రాణించారు. అనంతరం కెప్టెన్ డికాక్ (79 నాటౌట్ 52 బంతుల్లో) మెరుపులు మెరిపించడంతో దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.