16యేళ్ల తర్వాత మహేష్.. మళ్లీ అక్కడ !
సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్స్ లో ‘ఒక్కడు’ ఒక్కటి. మహేష్ ని స్టార్ ని చేసిన సినిమా ఇది. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. మహేష్ కి జంటగా భూమిక నటించారు. ఈ సినిమా కోసం ‘కొండారెడ్డి బురుజు’ దగ్గర పలు సన్నివేశాలని చిత్రీకరించారు. అవి సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహేష్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోనూ కొండారెడ్డి బురుజు కనిపించనుంది. హైరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా కొండారెడ్డి బురుజు సెట్ ని వేశారు. ప్రస్తుతం అక్కడే షూటింగ్ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో కొండారెడ్డి బురుజు ముందు మహేష్ నిలబడి ఉన్న ఫోటో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. “16యేళ్ల క్రితం ఈ కట్టడం (కొండారెడ్డి బురుజు) సిల్వర్ స్క్రీన్ మీద రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే కట్టడం వద్ద మరో హిట్ కోసం సిద్ధమవుతున్నాం. మా ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారు ఈ కట్టడాన్ని అద్భుతంగా రూపొందించారు. కర్నూల్ కొండారెడ్డి బురుజును ఆయన ఫిలిం సిటీకి తీసుకొచ్చారు” అంటూ రాసుకొచ్చారు.
ఈ చిత్రలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర-దిల్ రాజు-మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
16 years ago, this location became iconic on the silver screen. Now we are back to the same location. This time we aim to make it bigger. Our production designer A.S prakash garu recreated the location spectacularly.The man who brought Kurnool Kondareddy Buruju to Ramoji FilmCity pic.twitter.com/OcAaWEA8K1
— Anil Ravipudi (@AnilRavipudi) September 23, 2019