సైరాపై హైకోర్టులో పిటిషన్


సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో నరసింహారెడ్దిగా చిరు, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటించారు.  నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది. సైరా సెన్సార్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకొంది. దీంతో రిలీజ్ కి లైన్  క్లియర్ అయింది అనుకొన్నారు. 

ఇంతలో సైరాపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సైరా చిత్రబృందం తమని వాడుకొన్నారని ఉయ్యాలవాడ కుటుంబికులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ కథ కోసం మా దగ్గరికి వచ్చారు. మా నుంచి విలువైన సమాచారాన్ని సీకరించారు. షూటింగ్ కోసం మా ప్రాంతాన్ని, మా భూలని వాడుకొన్నారు. ఆ సమయంలో తమకి న్యాయం చేస్తామని రామ్ చరణ్ హామీ ఇచ్చారు. దాదాపు రూ. 52కోట్ల డీల్ జరిగింది. ఆ తర్వాత మొహం చాటేశారని వారు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 

మరోవైపు ఉయ్యాలవాడ వంశీయుల ఆందోళనని సైరా చిత్రబృందం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఉయ్యాలవాడ కుటుంబికులు హైకోర్టుకి వెళ్లారు. తమకి న్యాయం చేసే వరకు సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై కోర్టు ఏ తీర్పునిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.