‘అల..’ ఓవర్సీస్ రేటెంటో తెలుసా ?


త్రివిక్రమ్-అల్లు అర్జున్ లది హిట్ కాంబో. వీరి కలయికలో వచ్చిన జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వీరి కలయికలో తెరకెక్కుతోన్న అల.. వైకుంఠపురంలో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పైగా ఓవర్సీస్ లో త్రివిక్రమ్ సినిమాలకి మంచి గిరాకీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కి బంపర్ రేటు పలికింది. రూ. 8.56కోట్ల ఓవర్సీస్ రైట్స్ ని బ్లూ స్కయ్ సంస్థ సొంతం చేసుకొంది. ఓవర్ సీస్ మార్కెట్ ఇటీవల అంత ఆశాజనకంగా లేదు. ఇలాంటి నేపథ్యంలో అల వైకుంఠపురంలో సినిమాను తొమ్మిది కోట్లకు అమ్మడం మంచి రేటేనన్ చెప్పవచ్చు.

ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ఠ్స్, హారిక & హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన రెండు పోస్టర్స్ లో బన్నీ రెండు షేడ్స్ లో కనిపిస్తున్నారు. టీజర్, ట్రైలర్ వస్తే గానీ స్టోరీ లైన్ ఏంటన్నది తెలిసేలా లేదు.