బుమ్రాకి గాయం.. టెస్ట్ సిరీస్ కు దూరం !
దక్షణాఫ్రికాతో టెస్టు సిరీస్ కి ముందు కోహీ సేనకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు గాయమైంది. ఆయన వెన్నుగాయంతో బాధపడుతున్నాడు. సాధారణ రేడియాలజీ స్క్రీనింగ్‌లో బుమ్రా గాయం బయటపడింది.దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కి బుమ్రా దూరం కానున్నాడు. ఆయన స్థానంలో ఉమేష్ యాదవ్ ని తీసుకొన్నారు. బుమ్రాకు 7 నుంచి 8వారాల విశ్రాంతి అవసరమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బంగ్లాదేష్ తో సిరీస్ కి కూడా దూరం కానున్నారు.
‘బుమ్రా 7 నుంచి 8 వారాలు జట్టుకు దూరంగా ఉంటాడు. అంటే బంగ్లాదేశ్‌తో టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అతడు అందుబాటులో ఉండడు. ప్రస్తుతానికి అతడి పరిస్థితి ఇదీ. గాయాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం మంచిదైంది. కోలుకోవడానికి రెండు నెలల సమయమే పడుతుంది. లేదంటే ఇలాంటి గాయానికి ఇంకా ఎక్కువ సమయం అవసరం అవుతుంది’ అని బీసీసీఐ అధికారి అన్నారు. విండీస్ తో జరిగిన టెస్టు సిరీస్‌లో 2 మ్యాచుల్లో బుమ్రా 13 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.
JUST IN: Umesh Yadav replaces Jasprit Bumrah in India's Test squad#TeamIndia fast bowler Jasprit Bumrah has sustained a minor stress fracture in his lower back and has been ruled out of the upcoming Paytm Freedom Series for Gandhi-Mandela Trophy against South Africa. pic.twitter.com/yZiUmMABPt
— BCCI (@BCCI) September 24, 2019