‘గద్దలకొండ గణేష్’పై మహేష్ ప్రశంసలు


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ప్రిన్స్ మహేష్ బాబు అభినందించారు. మంగళవారం మహేష్ ‘గద్దలకొండ గణేష్’ సినిమాని చూశారు. అనంతరం చిత్రబృందాన్ని అభినందిస్తూ ట్విట్ చేశారు. ‘సినిమా ఎంజాయ్ చేశా. గణేష్ గా వరుణ్ తేజ్ నటన సూపర్.  గ్రేట్ వర్క్ హరీష్ శంకర్. చిత్రబృందానికి శుభాకాంక్షలు’ అంటూ మహేష్ రాసుకొచ్చారు. 

వాల్మీకిగా తెరకెక్కిన సినిమా గద్దలకొండ గణేష్ గా రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ్ హిట్ జిగర్తాండకి రిమేక్ ఇది. గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ ఇరగదీశాడు. హరీష్ శంకర్ కథ-కథనంతో కట్టిపడేశాడు. గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ లో హరీష్ శంకర్ సినిమాని డీల్ చేశారని చెబుతున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ వసూళ్లతో గద్దరకొండ గణేష్ దూసుకెళ్తోంది. ఇప్పటికే లాభాల్లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జంటగా పూజా హెగ్డే నటించింది. మిక్కి జే మేయర్ సంగీతం అందించారు.