ఫ్యాన్స్ టాక్ : పవన్ బాధ్యత కూడా చరణ్ దే !


మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ ఇస్తారని ఎవరు ఊహించలేదు. రాజకీయాల్లోకి వెళ్లాక చిరుని మళ్లీ సినిమాలు చేయమని అభిమానులు వేడుకొన్నారు. చిరు మాత్రం ససేమిరా అన్నారు. మళ్లీ మొహానికి రంగేసుకొనేది లేదని తేల్చి చెప్పారు. కానీ, ఆయన మనసు మారింది. కాదు.. చిరుని ఒప్పించింది చరణ్ అని చెబుతుంటారు. మెగాస్టార్ కి ఖైదీ నెం.150తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇప్పించారు. దాదాపు 10యేళ్ల తర్వాత తిరిగొచ్చినా.. టాలీవుడ్ అసలైన మెగాస్టార్ చిరునే అని నిరూపించాడు. ఇప్పుడు సైరాతో చిరు చిరకాల కోరికని తీరుస్తున్నారు చరణ్. చారిత్రాత్మక చిత్రంలో నటించాలన్న చిరు కోరిక సైరాతో తీరనుంది. 

ఈ సినిమా బడ్జెట్ విషయంలో చరణ్ ఏ మాత్రం ఆలోచించలేదట. భారీగా ఖర్చుపెట్టారట. సినిమా కోసం ఏది అంటే అది సమకూర్చారట. ఒక్క క్లైమాక్స్ ఏపీసోడ్ కోసమే ఏకంగా రూ. 75కోట్లు ఖర్చు చేశారట. జార్జీయాలో తీసిన క్లైమాక్స్ ఏపీసోడ్ అద్భుతంగా వచ్చిందని సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ బాధ్యత కూడ చరణ్ నే తీసుకోవాలని మెగా అభిమానులు కోరుతున్నారు. పవన్ ని రీ ఎంట్రీ ఇప్పించే బాధ్యత చరణ్ దే. పవన్ హీరోగా రామ్ చరణ్ భారీ సినిమాని నిర్మించాలని మెగా అభిమానులు కోరుకొంటున్నారు. మరీ..మెగా అభిమానుల కోరికని చరణ్ తీరుస్తాడేమో చూడాలి.