ఆర్.ఆర్.. వరుణ్ కి ఏం చెప్పారంటే ?
ఇక్కడ ఆర్.ఆర్ అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్. వీరిద్దరు కలిసి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ట్రెస్ ని జీరో చేశారంట. అసలు విషయం ఏంటంటే ? హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొంది. ఐతే, ఈ సినిమా రిలీజ్ ముందు వరకు వివాదాలు కొనసాగాయి. తెల్లారితే సినిమా రిలీజ్ అనగా రాత్రికే రాత్రే ‘వాల్మీకి’ టైటిల్ ని గద్దలకొండ గణేష్ ని మార్చేశారు. ఆ సమయంలో వరుణ్ తేజ్ బాగా టెన్షన్ పడ్డారట.
టెన్షన్ తట్టుకోలేక అన్నయ్య రామ్ చరణ్ కి ఫోన్ చేశారట. ఆయన ఇంటికి రా అనడంతో వెళ్లారట. ఆ సమయంలో చరణ్, తారక్ కలిసి కాఫీ తాగుతున్నారు. ఇద్దరు కలిసి నా ట్రెస్ ని జీరో చేశారని గద్దలకొండ గణేష్ సక్సెస్ మీట్ లో వరుణ్ చెప్పారు. ఇంతకీ చరణ్, తారక్ కలిసి వరుణ్ కి ఏం చెప్పారు ? అన్నది మాత్రం తెలీదు. ఆ విషయం వరుణ్ బయటపెట్టలేదు. బహుశా.. సినిమాల విషయంలో ఇలాంటివి సాధారణమే. ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పారేమో.. ! ఇక గద్దలకొండ గణేష్ వరుణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేలా కనిపిస్తొంది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడిని తీసుకొచ్చింది. ఇకపై వచ్చేవన్నీ లాభాలక్రిందే లెక్క.