‘సోలో బ్రతుకే సో బెటరు’ అంటోన్న తేజు


మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ఎఫైర్స్ నడపడంలో మొనగాడు అనిపించుకొన్నాడు. హీరోయిన్ రెజీనాతో తేజు ఎఫైర్ గురించి తెలిసిందే. వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. అసలు రెజీనా లేకుండా సినిమా చేయనని తేజు పట్టిబట్టినట్టు అప్పట్లో వార్తలొచ్చాయ్. రెజీనా కూడా తేజుని ఉడికించినట్టు ఒకట్రెండు కామెంట్స్ చేసింది. ఇప్పుడీ ఈ జంట బ్రేకప్ చెప్పుకొంది అనే ప్రచారం ఉంది. ఐతే, ఇటీవల తేజు రాశీఖన్నాకి దగ్గరైనట్టు కనిపిస్తోంది. వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజు పండగే’. మారుతి దర్శకుడు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల తేజ్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలో షేర్ చేసింది రాశీ. 

ఈ విషయం పక్కనపెడితే సోలో బ్రతుకే సో బెటరు అంటున్నాడు తేజు. ఇటీవలే తేజు కొత్త దర్శకుడు సుబ్బు చెప్పిన కథని ఓకే చేసిన సంగతి తెలిసిందే. మారుతి సినిమా తర్వాత ఈ సినిమానే చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం ‘సోలో బ్రతుకే సో బెటరు’అనే భిన్నమైన
టైటిల్ అనుకుంటున్నారట. ఈ పేరును ‘మనీ’ చిత్రంలోని ‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు’అనే పాట ద్వారా స్పూర్తి పొంది తీసుకున్నారట.
టైటిల్ బట్టి ఈ సినిమా  లవ్ & కామెడీ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది.అక్టోబర్ నుండి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది.