ప్రభాస్’కు ఆర్థిక కష్టాలు


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నట్టు సమాచారమ్. ప్రభాస్ ‘సాహో’ కోసం భారీగా ఖర్చుపెట్టారు. దాదాపు రూ. 370కోట్లు ఖర్చు చేశారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచిన ‘సాహో’ ప్లాప్ అయింది. దాంతో కొన్ని చోట్ల బయ్యర్లకి స్వల్ప నష్టాలు, మరికొన్ని చోట్ల భారీ నష్టాలు వచ్చినట్టు సమాచారమ్. ప్రభాస్ సొంత బ్యానర్ గా భావించే యూవీ క్రియేషన్స్ సాహో తెరకెక్కింది. స్నేహితులైన వంశీ, ప్రమోద్ చేసిన అప్పులకి ప్రభాస్ హామీ ఇచ్చారట. ఇప్పుడు వాళ్లంతా తమ అప్పులు తీర్చాలని ప్రభాస్ పై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మూడ్నాలుగు రోజులుగా ఇలాంటి వార్తలు షికారు చేస్తున్నారు. 

ఆ ప్రచారంలో నిజం లేదని యూవీ క్రియేషన్స్ నుంచి కానీ ప్రభాస్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కి ఆర్థిక కష్టాలు నిజమేనని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్ దర్శకుడు రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం కోసం జాన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రమే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. సాహో రిజల్ట్ ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొన్నారు ప్రభాస్. లేదంటే జెడ్ స్పీడుతో షూటింగ్ జరిగేదే. సాధ్యమైనంత త్వరలో రాథాకృష్ణ సినిమాని పూర్తి చేసి.. దాని ద్వారా వచ్ఛే డబ్బుతో సాహో అప్పులు తీర్చాలనే ప్లాన్ లో యూవీ క్రియేషన్స్ ఉన్నట్టు సమాచారమ్.