ఐదు సార్లు వేధింపులకి గురయ్యా !
క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సినీ పరిశ్రమని షేక్ చేశాయి. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వచ్చిన #మీటూ ఉద్యమం.. దేశంలోని అన్నీ చిత్ర పరిశ్రమలకి పాకింది. లైంగిక వేధింపుల ఘటనలు చాలానే వెలుగులోనికి వచ్చాయి. కొందరికి శిక్ష కూడా పడింది. మరికొందరిపై అవి ఆరోపణలుగానే మిగిలిపోయాయ్. ఇప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు బయటికొస్తూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులని బయటపెట్టింది.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన కెరీర్ లో ఐదుసార్లు లైంగిక వేధింపులకి గురయ్యానని తెలిపింది. దక్షిణాదిన మూడు సార్లు, బాలీవుడ్ లో రెండు సార్లు ఆ అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది. ఓ దర్శకుడు తన శరీర భాగాలను చూడాలనుకున్నాడు. మరో దర్శకుడు తన తొడలు ఎలా ఉంటాయో చూడాలని అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఆ దర్శకుల పేర్లని మాత్రం సుర్వీన్ చెప్పలేదు. 2009లో వచ్చిన ‘రాజు మహారాజు’ సినిమాలో శర్వాకి జోడిగా నటించింది సుర్వీన్.