ఇల్లీ బెల్లీ డ్యాన్స్ చూశారా ?


టాలీవుడ్ తొలి కోటి కథానాయిక అనిపించుకొంది ఇలియానా. ఇక్కడ బిజీగా ఉండగానే బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ మంచి నటి అనిపించుకొన్నా. బిజీ హీరోయిన్ కాలేకపోయింది. రవితేజ ‘అమర్ అక్భర్ ఆంథోనీ’ సినిమాతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ.. ఇక్కడ మళ్లీ బిజీ కావాలని ఆశపడింది. ఐతే, అమర్ అక్భర్ ఆంథోనీ ప్లాప్ కావడంతో ఇల్లీకి మరిన్ని ఆఫర్స్ రాలేదు.

పైగా ఇల్లీ ఒక్కప్పటిలా సన్నజాజి నడుంపిల్లలా లేదు. బాగా లావెక్కింది. షేపులు మారాయ్. ఈ నేపథ్యంలో అమెకి ఆఫర్లు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో బరువులు తగ్గించే పనిలో పడింది ఇల్లీ. ఇందుకోసం ప్రత్యేకంగా కసరత్తులు చేస్తోంది. రీసెంట్ గా కాస్త లావు తగ్గింది. ఆ ఫోటోలని తన ఇన్ స్ఘ్రోగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో ఇల్లీ బెల్లీ డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ఇల్లీ బెల్లీ డ్యాన్స్ ని మీరు చూసేయండీ.. !