‘గద్దలకొండ గణేష్’ వస్తే కాలేజ్ మోత మ్రోగిపోయింది !


‘గద్దలకొండ గణేష్’గా థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ టూర్ ప్లాన్ చేసింది. వరంగల్ నుంచి మొదలెట్టి రెండు తెలుగు రాష్ట్రాలని చుట్టేసేలా టూర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా గద్దలగణేష్ చిత్రబృందం ఇవాళ గుంటూరు ‘వివిఐటీ’ కాలేజీని సందర్శించారు.
 
ఈ సందర్భంగా కాలేజీ స్టూడెంట్స్ చేసిన హంగామాని వరుణ్ తేజ్ సెల్ఫీ వీడియోని చిత్రీకరించారు. దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వీడియోలో కాలేజీ స్టూడెంట్స్ ఈలలు, కేకలతో ఆ ప్రాంతం మారుమ్రోగిపోయింది. ‘వండర్ ఫుల్ ఎనర్జి.. సినిమాని అభినందించినవారందరికీ కృతజ్ఝతలు’ అంటూ వరుణ్ వరుణ్ కామెంట్ పెట్టారు. ఇక, ఈ చిత్రంలో వరుణ్ కి జంటగా పూజా హెగ్డే నటించింది. సినిమాలో అన్నీ రకాల ఎమోషన్స్ పండాయి. ఊరమాస్ పాత్రలో వరుణ్ నటన హైలైట్ గా నిలిచింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్.. గద్దలకొండ గణేష్ తో వరుణ్ కి అలాంటి హిట్ ఇచ్చారని మెగా అభిమానులు చెప్పుకొంటున్నారు. ఈ హిట్ కిక్కుతో ఉన్న చిత్రబృందం సక్సెస్ టూర్ ని ఎంజాయ్ చేస్తోంది.