రేపే.. సైరా నుంచి మరో ట్రైలర్ !


మెగా అభిమానులకి గుడ్ న్యూస్. సైరా నుంచి మరో ట్రైలర్ రాబోతుంది. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా’. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సైరా టీజర్, ట్రైలర్ వచ్చేశాయ్. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా జరిగింది. ప్రధాన పాత్రలకు సంబంధించిన స్పెషల్ వీడియోలు వచ్చేశాయ్. దీంతో సైరా ప్రమోషన్స్ పీక్స్ కి వెళ్లాయి. కానీ, ఆ డోస్ చాలలేదు. సైరాని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చిత్రబృందం భావిస్తున్నట్టుంది. ఈ నేపథ్యంలో సైరా నుంచి మరో ట్రైలర్ ని వదలనున్నారు.

రేపు (సెప్టెంబర్ 26) ఉదయం 10:30నిమిషాలకి సైరా సెకండ్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అధికార ట్విట్టర్ ద్వారా తెలిపారు. తొలి ట్రైలర్ లో మెగాస్టార్ యాక్షన్ హైలైట్ గా నిలిచింది. ఐతే, సెకండ్ టీజర్ లో ఎమోషన్స్ కి పెద్దపీఠ వేయనున్నారని సమాచారమ్. ఆంగ్లేయులతో భీకర యుద్ధానికి సంబంధించిన బిట్ సీన్స్ చూపిస్తూనే ప్రేక్షకులకి ఎమోషనల్ గా టచ్ అయ్యేలా సెకండ్ ట్రైలర్ ఉండబోతుందని తెలుస్తోంది.