మద్యం దుకాణాల లైసెన్సులు పొడగింపు


తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాల అనుమతిని మరో నెలరోజుల పాటు పొడిగించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న 2,216 మద్యం దుకాణాలు నెలరోజులపాటు యథాతథంగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల గడువు సెప్టెంబర్‌ ఆఖరుతో ముగియాల్సి ఉంది.  అక్టోబర్‌ 1 నుంచి కొత్త మద్యం విధానంలో లైసెన్సుదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే నూతన విధానంపై అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అధికారుల నివేదికను అన్ని రకాలుగా పరిశీలించిన ప్రభుత్వం.. లైసెన్సుల గడువును పెంచింది. నవంబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలులోకి రానుంది.