అల..  థమన్ వినిపించబోతున్నాడు !

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి సప్రైజ్ రాబోతుందని సోమవారం థమన్ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ సిట్టింగ్ లో కూర్చున్న థమన్ పోస్టర్ ని షేర్ చేయడంతో.. బహుశా సినిమా ప్రమోషనల్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారని అందరు భావించారు. ఇందులో బన్నీ కూడా కనిపిస్తాడని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 

కొద్దిసేపటిక్రితమే సప్రైజ్ పై థమన్ మళ్లీ ట్విట్ చేశారు. వెయిట్ ముగిసింది. మరికొన్ని నిమిషాల్లో వినబోతున్నారని థమన్ ట్విట్ చేశారు. థమన్ లైవ్ కంపోజ్ చేస్తూ అల.. వైకుంఠపురంలో సాంగ్ ని విడుదల చేయబోతున్నట్టు అర్థమవుతోంది. ఆ సప్రైజ్ ఏదైనా.. బన్నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.