చాణక్య ట్రైలర్ టాక్ 

తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన చిత్రం ‘చాణక్య’. గోపీకి జంటగా మెహ్రీన్ నటించింది. ఈ చిత్రాన్ని  ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. దసరా కానుకగా చాణక్య అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

ఇందులో గోపీచంద్ రా ఏజెంట్, బ్యాంక్ ఎంప్లాయిగా రెండు పాత్రల్లో కనిపించారు. యాక్షన్ మూడుని హైలైట్ చేస్తూ ట్రైలర్ ని కట్ చేశారు. ‘మీరు ‘RAW’ని లెఫ్ట్ నుంచి రైట్ కి చదువుతారు. మేం రైట్ నుంచి లెఫ్ట్ కి చదువుతాం. అప్పుడు RAW వార్ అవుతుంది’, చావుకి తెగించినోడు బుల్లేటుకి బయపడడు ఖురేషి’ అనే డైలాగ్స్ బాగా పేలాయ్. యాక్షన్ మూడుతో పాటు, హీరోయిన్ మెహ్రీన్ తో రొమాంటి ఏపీసోడ్ ని ట్రైలర్ లో చూపించారు. మొత్తంగా చాణక్య ట్రైలర్ అదిరింది.