రజనీ, కమల్’లకి చిరు పొలిటికల్ సలహా !


సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ రాజకీయాల్లోకి వెళ్లారు. కమల్ ఇప్పటికే ‘మక్కల్ నీది మయ్యం’ అనే రాజకీయ పార్టీ స్థాపించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం మొదలెట్టారు. ఇక రజనీ పొలిటికల్ ఎంట్రీపై స్పష్టమైన ప్రకటన చేశారు. త్వరలోనే పార్టీ పేరు, సింబల్ ప్రకటించబోతున్నారు. వీరిద్దరికి మెగాస్టార్ చిరంజీవి ఓ ఉచిత సలహా ఇచ్చారు. మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లడం.. తిరిగి బయటికి రావడం జరిగిన సంగతి తెలిసిందే.

‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించిన చిరంజీవి దాన్ని విజయవంతంగా నడపలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీకి కాంగ్రెస్ లో విలీనం చేసి.. ఫలితంగా కేంద్ర మంత్రి అయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత కొన్నాళ్లకి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తన రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం.150తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నారు. ప్రస్తుతం ఆయన151సినిమాగా సైరా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా దక్షిణాదిన అన్నీ బాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. 

తమిళ్ సైరా ప్రమోషన్స్ లో పాల్గొన్న మెగాస్టార్ సూపర్ స్టార్స్ రజనీ, కమల్ లకి విలువైన పొలిటికల్ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.రాజకీయాలను ధన ప్రాబల్యం, కుల ప్రాతిపదికన నడుస్తున్నప్పుడు.. రాజకీయాలలోకి వచ్చి సమయం వృధాచేసుకోవడం అనవసరమని అన్నారట. ఇందుకు నేను, మా తమ్ముడు పవన్ కల్యాణ్ నే ఉదాహరణ అని చెప్పారట. మరీ.. ఇప్పటికే రజనీ, కమల్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో చిరు సలహా విని.. రాజకీయాలని తప్పుకుంటారా ? అంటే అది జరగని పని అనే చెప్పాలి. కాకపోతే.. చిరు సలహా వారికి రాజకీయ అనుభవంలో ఉపయోగపతుందని చెప్పవచ్చు.