కోన ట్విట్ : ప్రమాదకంగా హైవే పిల్లర్
మెట్రో హైదరాబాద్ స్థాయిని పెంచుతుంది అనుకొన్నారు. ట్రాఫిక్ సమస్యలకి సమాధానం చెబుతుందని భావించారు. కానీ, ప్రాణాలు తీసుందని ఎవరూ ఊహించలేదు. ఇటీవల ఈ ఊహించనిదే జరిగింది. అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద పెచ్చులూడి పడిన ఘటనలో ఓ యువతి మరణించింది. ఈ నేపథ్యంలో మెట్రో, ఫ్లై ఓవర్ల నిర్మాణాలపై అనుమానాలు కలుగుతున్నాయి.
తాజాగా సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 20 వద్ద ఉన్న పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రమాదకరంగా పెచ్చులు ఊడిపోయిన ఫ్లై ఓవర్ ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేశారు. ఈ ట్విట్ మంత్రి కేటీఆర్ తో పాటుగా జీహెచ్ఎంసీలకు ట్యాగ్ చేశారు. కోన ట్విట్ పై అధికారుల రియాక్షన్ ఎలా ఉండనుంది అనేది చూడాలి.
Damaged condition of the PVNR expressway near Pillar No : 20 , please take care before it’s too late @GHMCOnline @KTRTRS
Source: Facebook friend pic.twitter.com/1Disn6bMRy— kona venkat (@konavenkat99) September 26, 2019