సైరా సెకండ్ ట్రైలర్ పై వర్మ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ నుంచి రెండో ట్రైలర్ వచ్చేసింది. ‘గడ్డి పరక కూడా గడ్డ దాటి వెళ్లకూడదని’ ట్రైలర్ లో గర్జించాడు మెగాస్టార్. భీకర పోరాటలు, రొమాలు నిక్కబోడిచే డైలాగ్స్ తో ట్రైలర్ అదిరింది. సైరా రేంజ్ ఏంటో చూపేలా రెండో ట్రైలర్ ని కట్ చేశారు. ఈ ట్రైలర్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. “చిరు స్థాయికి తగ్గ చిత్రం తీసి చిరంజీవికి మరియు తెలుగు ప్రేక్షకులకు గొప్ప బహుమతిని ఇచ్చిన నిర్మాత రామ్ చరణ్ కి ధన్యవాదాలు. సైరా సినిమా రామ్ చరణ్ ఆయన తండ్రి చిరంజీవితో పాటుగా అభిమానులకి ఇవ్వనున్న గిఫ్ట్” అని వర్మ అన్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా తెరకెక్కింది. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో నరసింహారెడ్డిగా చిరు, ఆయన గురువు పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, జగపతి బాబు, నిహారిక, కిచ్చ సుధీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించారు. రామ్ చరణ్ నిర్మించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తం ఐదు బాషల్లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలోనూ సైరా విడుదలకానుంది.
WOWWWW! #SyeRaa is an ultimate befitting tribute to the phenomenon of MEGA STAR CHIRANJEEVI GARU ..Kudos to Producer RAM CHARAN for giving this gift to both his father and the audience 🙏🙏🙏 https://t.co/HE7djQ4fua
— Ram Gopal Varma (@RGVzoomin) September 26, 2019