అల.. వైకుంఠపురంలో : ‘సామజవరగమన.. ‘ సాంగ్ సూపర్భ్ ! 


థమన్ ఇంకా ఊరిస్తున్నారు. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి సప్రైజ్ రాబోతుందని సోమవారం థమన్ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ గంట క్రితం బన్నీ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. ‘అల.. వైకుంఠపురంలో’ సప్రైజ్ వినిపింబోతున్నట్టు ట్విట్ చేశారు. ఇంతసేపు వెయిట్ చేయించిన థమన్ ‘సామజవరగమన.. ‘ని అతికొద్దిసేపట్లో రిలీజ్ చేయబోతున్నట్టు ట్విట్ చేశారు.

సాంగ్ ప్రోమో లాంటిది విడుదల చేశారు. సాంగ్ బిట్ సాంగ్ అదిరిపోయింది. మొబైల్ రింగు టోన్స్ తో మారుమోగిపోవాల్సిందే. కొద్దిసేపట్లో పూర్తి సాంగ్ ని అందించబోతున్నాం. అప్పటి వరకు.. ఈ ట్యూన్ ని విని ఎంజాయ్ చేయండి !