సన్నీలియోన్ తో ‘కామసూత్ర’ !


శృంగార తార ఇమేజ్ నుంచి సన్నీలియోన్ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. బాలీవుడ్  హాట్ బ్యూట్ గా గుర్తింపు తెచ్చుకొంది. సినిమాలు, ఐటమ్ సాంగ్ లు, వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతోంది. ఇలాంటి సమయంలో సన్నీ మళ్లీ పార్న్ ఇమేజ్ లోకి వెళ్లి నటించబోతున్నట్టు సమాచారమ్. సన్నీ కామసూత్ర’ వెబ్‌సిరీస్‌లో నటించనున్నారని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

బాలీవుడ్‌ దర్శకురాలు ఏక్తా కపూర్‌ ‘కామసూత్ర’ ఆధారంగా చేసుకుని ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఈ వెబ్‌సిరీస్‌లో నటించమని సన్నీలియోనీతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారట. కథ విన్న సన్నీలియోనీ ఇందులో నటించేందుకు సుముఖంగా ఉన్నారని బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. ఏక్తాకపూర్‌, సన్నీలియోనీ కలిసి ‘రాగిణి-ఎంఎంఎస్‌2 ‘ చిత్రం కోసం పనిచేసిన విషయం తెలిసిందే. ఆ పరిచయంతోనే ఏక్తాకపూర్ సన్నీని కామసూత్ర కోసం ఒప్పించినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఒకప్పటి సన్నీ మళ్లీ చూడొచ్చు. సన్నీ ఎలాంటి కామసూత్రాలు నేర్పిస్తుందనేది చూడాలి.