విజయ్ కొత్త లుక్ చూశారా ?


రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త లుక్ లోకి మారిపోయాడు. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-రష్మిక మందన జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే వచ్చేసింది. ఇందులో విజయ్ దాదాపు అర్జున్ రెడ్డి లుక్ లోనే కనిపించారు. ఈ సినిమాలో మరో షేడ్ కూడా ఉన్నట్టుంది. తాజా విజయ్ మరో లుక్ లోకి మారిపోయారు. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్లిన విజయ్ కొత్త లుక్ లో కనిపించారు. అదే లవ్వర్ లుక్ అని తెలిసిపోయింది.

KLM శాంపింగ్ మాల్ కు విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం హైదరాబాద్ ఎఎస్ రావ్ నగర్ లో KLM శాంపింగ్ మాల్ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ కు విజయ్ హాజరయ్యారు. విజయ్ చేతుల మీదుగా మాల్ ఓపెనింగ్ జరిగింది. విజయ్ ని చూసేందుకు వేలాదిగా మాల్ కి తరలి వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంత కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా విజయ్ దిగిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.