బిగ్ బాస్ హౌస్ లో పెళ్లిచూపుల సీన్.. సూపర్ హిట్ !


బిగ్ బాస్ హౌస్ లో గతవారం టాస్క్ లు చాలా చప్పగా ఉన్నాయనే విమర్శలొచ్చాయ్. ఈ నేపథ్యంలో ఈవారం టాస్క్ లని స్పెషల్ గా ప్లాన్ చేసినట్టున్నారు. ఎంటర్ టైన్ మెంట్ డబుల్ అయింది. ఈ వారం రాహుల్, వరుణ్ ల మధ్య పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో హౌస్ సభ్యులంతా ఒక వైపు.. రాహుల్, పునర్నవిలు ఒకవైపుగా మిగిలినట్టు స్పష్టం అవుతోంది. 

కెప్టెన్ కోస అర్హత సాధించేందుకు ఇచ్చిన టాస్క్ వినోదాత్మకంగా సాగింది. శివజ్యోతి తన కొడుకులు లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్లిపోయారని చెబుతూ, మీ పెళ్లి చూపులు నేను చూడలేకపోయాను. పెళ్లి చూపులు ఎలా జరిగాయో కాస్త చూపిస్తారా అని కొడుకులని కోరింది. దీంతో పెద్ద కొడుకు రవికృష్ణ, పెద్ద కోడలు శ్రీముఖి పెళ్లి చూపుల సీన్‌ని లైవ్‌లో ఆమెకి చూపించారు. ఈ సీన్ లో శ్రీముఖీ సిగ్గుపడుతూ…ఫుల్ ఎంటర్ టైన్ చేసింది. ఈ సీజన్ లో ఇదే బిస్ట్ సీన్ గా చెబుతున్నారు. ఇక ఈ వారం కెప్టెన్ టాస్క్ కోసం శివజ్యోతి, శ్రీముఖీ, బాబా భాస్కర్, రవికృష్ణ అర్హత సాధించారు. గురువారం ఏపీసోడ్ లో మరో హైలైట్ అలీ రెజా రీ ఎంట్రీ. 

ఆయన షర్ట్ విప్పేసి.. రష్యన్ భామల డ్యాన్సుల మధ్య రీ ఎంట్రీ ఇచ్చేశారు. ఆ సమయంలో శివజ్యోతి మళ్లీ ఎమోషనల్ అయింది. ఐతే, సోషల్ మీడియాలో శివజ్యోతి పై వస్తున్న మీమ్స్ గురించి అలీ సరదాగా ఇంటి సభ్యులతో పంచుకొన్నారు. అలీ రీఎంట్రీతో బిగ్ బాస్ ఇంట్లో పోటీ మరింత రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు.