ఇస్మార్ట్ శంకర్ : ‘ఉండిపో..’ ఫుల్ వీడియో సాంగ్


ఇస్మార్ట్ శంకర్ ఇప్పటికే హవా చూపిస్తున్నాడు. పూరి దర్శకత్వంలో ఎనర్జిట్ హీరో రామ్ నటించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నిథి అగర్వాల్, నభా నటాషా హీరోయిన్స్. మణిశర్మ సంగీతం అందించారు. జులై 18న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాడు. మాస్ ని మస్త్ మురిపించిండు. ఐతే, ఇప్పటికీ ఇస్మార్ట్ శంకర్ హవా చూపిస్తుండటం విశేషం.

ఈ సినిమా వీడియో సాంగ్స్ ని ఒక్కొక్కటిగా వదులుతోంది చిత్రబృందం. ఇప్పటికే రెండు సాంగ్స్ వదిలారు. తాజాగా మూడో ‘సాంగ్ ఉండిపో ఉండిపో చేతిలో గీతలా.. ‘ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాటని రామ్-నిధి అగర్వాలపై బీచ్ లో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ పాటకి భాస్కర భట్ల రిలిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహర్ కలిసి ఆలపించారు. ‘ఉండిపో.. ‘ సాంగ్ వీడియో సాంగ్ ని చూసేసి.. మీరు ఎంజాయ్ చేయండీ.. !