‘ఆవిరి’ టీజర్.. మాటల్లేవ్ !


ప్రయోగాత్మక చిత్రాలు తీస్తుంటాడు దర్శకుడు రవిబాబు. ఆయన పదిపిల్లపై చేసిన ప్రయోగం వికటించింది. అదేనండీ.. పందిపిల్ల ప్రధాన పాత్రలో రవిబాబు తీసుకొచ్చిన ‘అదిగో’ అట్టర్ ప్లాప్ అయింది. భారీ నష్టాలని తీసుకొచ్చింది. అయినా.. రవిబాబు తగ్గలేదు. ఆయన మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. అదే ‘ఆవిరి’. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో రిలీజ్ చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. రవిబాబు మార్క్ టీజర్ అని చెప్పవచ్చు. ఎక్కడ ఒక్క డైలాగ్ లేదు. అలాగాని భీభత్సంగా భయపెట్టేందుకు ప్రయత్నించలేదు. కానీ, టీజర్ బాగుంది. ఓ ఇంట్లో ఓ దెయ్యం ఉందనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా టీజర్ లో చూపించారు. మీరు నివసిస్తున్న ఇంట్లో మీకు తెలియని కంపెనీ ఉంటే? మీరు ఆత్మను ఎలా గుర్తిస్తారు ? మీకు తెలిస్తే మాకు చెప్పండ‌ని టీజ‌ర్ లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమాని చూసిన దిల్ రాజు.. ఆయనే రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రంలో ర‌విబాబుతో పాటు నేహా చౌహ‌న్, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్, ముక్త‌ర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు.