సాహో, సైరాకు అదే తేడా !
రిలీజ్ కి ముందే ‘సాహో’ చిత్రబృందంలో కాన్ఫిడెన్స్ మిస్సయినట్టు కనిపించింది. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రమిది. బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి వచ్చిన భారీ బడ్జెట్ సినిమా ఇది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కూడా ఇదే. దీంతో సాహోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు సాహో కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఐతే, ఆ అంచనాలని సాహో అందుకోలేకపోయింది. అంతేకాదు.. రిలీజ్ కి ముందే సినిమాపై చిత్రబృందానికి నమ్మకం పోయినట్టుంది. వాస్తవానికి ఆగస్టు15నే సాహో రావాల్సివుంది. ఐతే, ఆ డేటున బాలీవుడ్ లో మిషన్ మంగళ్, బాట్ల హౌస్ విడుదలవనున్న నేపథ్యంలో సాహోని ఆగష్టు 30కి వాయిదా వేశారు.ఇదంతా సినిమాపై కాన్ఫిడెన్స్ లేకపోవడం వలనే జరినట్టు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ‘సైరా’ విషయంలో అలాకాదు. సినిమాపై చిత్రబృందం చాలా నమ్మకంగా కనిపిస్తోంది.
సైరాకి పోటీగా బాలీవుడ్ లో ‘వార్’ సినిమా రాబోతున్నా.. భయపడటం లేదు. ఇదే సాహో, సైరాకి ఉన్న తేడా. రిలీజ్ కి ముందే సాహోపై చిత్రబృందానికి కాన్ఫిడెన్స్ లోపించింది. సైరా చిత్రబృందం మాత్రం కాన్ఫిడెంట్ గా ఉందని చెప్పకొంటున్నారు. ఇక బాలీవుడ్ లో తెలుగు సినిమా తడఖా నిరూపించాల్సిన బాధ్యత సైరాదే. ఎందుకంటే ? బాహుబలితో తెలుగు సినిమా గొప్పదనం బాలీవుడ్ జనాలకి తెలిసొచ్చింది. ఐతే, ఆ క్రెడిట్ దర్శకధీరుడు రాజమౌళి ఖాతాలోకే వెళ్లింది. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి వచ్చిన భారీ బడ్జెట్ సినిమా సాహో నిరాపరిచింది. అయినా.. బాలీవుడ్ లో రూ. 150కోట్లు రాబట్టింది అనుకోండి. కాకపోతే.. మంచి టాక్ తెచ్చుకోలేదు. ఈ నేపథ్యంలో సైరా బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. బాలీవుడ్ లో తెలుగు సినిమాపై మరింత గౌరవం పెరిగే ఛాన్స్ ఉంది. మరీ.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేస్తారు అన్నది చూడాలి.