‘సామజవరగమన..’ సాంగ్ అద్భుత: 


అల.. ఊరించిన సామజవరగమన సాంగ్ వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా నుంచి సప్రైజ్ అంటూ థమన్ బన్నీ అభిమానులని తెగ ఊరించాడు. అది సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘సామజవరగమన.. ‘ అంటూ సాంగ్ ప్రోమో ని వదిలాడు. అది విన్నాక అభిమానులు ఆగలేకపోయారు. అంత అద్భుతంగా ఉంది.. ఆ పాట. ఇక కొద్దిసేపట్రి క్రితమే సామజవరగమన ఫుల్ సాంగ్ ని విడుదల చేశారు. 

పాట అద్భుతంగా ఉంది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ సాంగ్ అని చెప్పవచ్చు. సిరివెన్నెల సీతారామశాస్త్రీ రాసిన ఈ పాటని సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ సంగీతం అందించారు. ఇక తాజాగా విడుదల చేసిన సాంగ్ వీడియోలో పాట లైవ్ కంపోజ్ ని చూపించారు. దాంతో పాటు బన్నీ, పూజా హెగ్డే లు కనిపించారు. సాంగ్ లో బన్నీ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించారు. సింగిల్ సాంగ్ తో అల.. వైకుంఠపురంలో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. అంత బాగుంది.. ఈ పాట. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుత:

ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. యంగ్ హీరోలు సుశాంత్, నవదీప్ కి మంచి పాత్రలు దక్కాయని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న అల.. ప్రేక్షకుల ముందుకు రానుంది.