కొత్త కెప్టెన్ ఎవరంటే ?


టీమిండియాకు ఒకే కెప్టెన్ విరాట్ కోహ్లీ. టీ20, వన్డే, టెస్టులు.. మూడు ఫార్మెట్లకి కోహ్లీనే కెప్టెన్. దీంతో ఆయనపై పని భారం తగ్గించేందుకు టీ20 కెప్టెన్ బాధ్యతని రోహిత్ శర్మ ఇవ్వాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సూచించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కనపెడితే.. బిగ్ బాస్ హౌస్ కి మాత్రం వారం వారం కొత్త కెప్టెన్ ఎన్నికవుతుండాన్న సంగతి తెలిసిందే. దానికోసం బిగ్ బాస్ ఓ టాస్క్ ని నిర్వహిస్తుంటాడు. ఈ వారం కెప్టెన్ టాస్క్ లో శివజ్యోతి, బాబా భాస్కర్, శ్రీముఖి, రవి పాల్గొన్నారు. వీరిలో శ్రీముఖి గెలుపొంది.. ఈవారం కెప్టెన్ అయింది. ఇంతకీ బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్ టాస్క్ ఏంటో తెలుసా.. ?

పోటీదారులకు వివిధ రంగుల కలర్స్ బౌల్స్ ఇచ్చి అందులోని కలర్స్‌ని రెండు చేతులతోనూ పట్టుకుని కింద పడకుండా చూసుకోవాలని ఫైనల్‌గా ఎవరి బౌల్‌లో ఎక్కువ కలర్ ఉంటుందో వాళ్లే ఇంటికి కెప్టెన్‌ అవుతారు అనేది టాస్క్. బాబా భాస్కర్ చేతిలో నుండి అలీ రంగును తీసుకోవడంతో అతడు ఔట్ అయ్యాడు. అలాగే శివజ్యోతి మధ్యలో ఒక్క చేతితోనే బౌల్‌ను పట్టుకున్నందుకు పోటీ నుంచి తప్పుకున్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. చివరిగా రవి, శ్రీముఖిలలో హౌస్ మేట్స్ మద్దతు శ్రీముఖికి ఉండడంతో ఆమె ఈవారం కెప్టెన్ అయింది. ఇక, ఈ వారం హౌస్ ఎలిమినేట్ కాబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.