ఆవిరి టీజర్ 2 : ఏంటో.. ఈ సస్పెన్స్ !


దర్శకుడు రవిబాబు మళ్లీ థ్రిల్లర్ జోనర్ లోకి వచ్చి చేసిన చిత్రం ‘ఆవిరి’. ఈ సినిమా నుంచి మూడు టీజర్స్ ప్లాన్ చేశారు. మొదటి టీజర్ శనివారం విడుదల చేశారు. అది చూశాక అవును3 అనిపించింది. ఇక కొద్దిసేపటి క్రితమే ఆవిరి రెండో టీజర్ ని వదిలారు. మొదటి టీజర్ కి కొనసాగింపుగా ఉంది తాజా టీజర్. మాటలు లేకుండా సలైన్స్ తో సస్పెన్స్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా రెండో టీజర్ ఉంది. ఇక మూడో టీజర్ లో నైనా అసలైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయేమో చూడాలి.

ఇప్పటికే ఈ సినిమాని చూసిన దిల్ రాజు.. ఆయనే రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రంలో ర‌విబాబుతో పాటు నేహా చౌహ‌న్, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్, ముక్త‌ర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు.