‘గద్దలకొండ గణేష్’ డిలీట్ సీన్ చూశారా ?


ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2 సినిమాలతో విజయాలు అందుకొన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఐతే, ఆయా సినిమాలకు గానూ పూర్తి క్రెడిట్ వరుణ్ తేజ్ ఖాతాలో పడలేదు. ‘ఫిదా’లో ఎక్కువ క్రెడిట్ సాయిపల్లవి ఖాతాలోకే వెళ్లింది. తొలిప్రేమ హిట్ క్రెడిట్ ని రాశీఖన్నా-వరుణ్ తేజ్ కలిసి పంచుకొన్నారు. ఎందుకంటే ? ఈ సినిమాలో రాశీ బాగా నటించింది. ఇక ఎఫ్ 2 క్రెడిట్ హిట్ క్రెడిట్ ని వెంకీ, వరుణ్, అనిల్ రావిపూడి కలిసి పంచుకొన్నారు. ‘గద్దలకొండ గణేష్’ సినిమా క్రెడిట్ మాత్రం వరుణ్ తేజ్ ఖాతాలోనే పడింది.

దర్శకుడు హరీష్ శంకర్ పరిస్థితి ఏంటీ ? అంటే.. ఆయనకి కొత్తగా క్రెడిట్ దక్కాల్సిందేమీ లేదు. ఇప్పటికే మంచి దర్శకుడు అనిపించుకొన్నాడు. ‘గబ్బర్ సింగ్’తోనే హరీష్ టాలెంట్ ఏంటో ఇండస్ట్రీకి తెలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే గద్దలకొండ గణేష్ వరుణ్ కి చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇందులో ఆయన నట విశ్వరూపం చూపించారు. ముందు ముందు వరుణ్ తేజ్ ఎన్ని సినిమాలు చేసిన.. ఈ సినిమా మాత్రం ఆయనకి, ఆయన అభిమానులకి ప్రత్యేకంగా నిలిచిపోవడం ఖాయం. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ గా తేల్చేశారు ప్రేక్షకులు. 

ఇక ఈ సినిమా నుంచి శనివారం డిలీట్ సీన్ ఒకటి విడులైంది. గద్దలకొండ గణేష్ పై పెంచెలయ్య మనుషులు అటాక్ చేసే క్రమంలో వారిని ఎదుర్కొన్న గణేష్, ఫోన్ లో పెంచలయ్యకు వార్నింగ్ ఇచ్చే ఆ సన్నివేశంలో వరుణ్ బీభత్సంగా ఉన్నాడు. రేయ్ గద్దలకొండ నాకు బలం కాదు, నేనే గద్దలకొండకి బలం అని వరుణ్ చెప్పిన డైలాగ్ అదిరింది. ఇంత మంచి సీన్ ని ఎందుకు కత్తెరపెట్టారో తెలీదు. బహుశా.. రన్ టైం తగ్గించే క్రమంలో ఈ మంచి సీన్ కు కత్తెర పడినట్టుంది. ఇప్పుడీ సీన్ ని ఎంజాయ్ చేయండీ.. !